ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి

 

ప్రతి ఒక్కరి దైనందిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్  తెలిపారు. చంద్రగిరి కోట నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 కార్యక్రమము లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,  తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గోన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు పాటు అంత రాష్ట్రవ్యాప్తంగ, జిల్లా మండల, గ్రామ స్థాయి వరకు  యోగా ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి శిక్షణ, అవగాహన కల్పించాలని తెలిపారు.  ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగ ఉండాలని ఉద్దేశంతో  ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు.

సచివాలయం పరిధి,వార్డు పరిధి లో అందరికీ  యోగా గురించి శిక్షణ, అవగాహన  కల్పిపిస్తున్నామని అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ జరిగింది అని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మిగతా అధికారుల తో కలిసి ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరమని వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడవుతుందని యోగ చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.