కోట్ల ఖర్చుతో యోగా..ఏపీకి మైలేజ్ వస్తుందా?
posted on Jun 23, 2025 9:02PM

నిజానికి చంద్రబాబుది బాహుబలి ఐడియా. ఆయన రాయి రాయి కొట్టుకుంటూ పోరు. ఒక్క దెబ్బతో కొడితే కొండ ఎలా పిండి అవుతుందో చేసి చూస్తారు. ఈ విషయంలో ఆయన ఇప్పటి వరకూ చేసిన కృషి చాలానే ఉంది. మీరు కావాలంటే చూడండి ఆయన సీఎం అయిన తొలి నాళ్లలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని వెంటపడి మరీ ఒకే ఒక్క ప్రజంటేషన్ ఇచ్చి.. ఏకంగా ఆ కంపెనీ ఆఫీసు హైదరాబాద్ వచ్చేలా చేశారు. తర్వాతి కాలంలో హైదరాబాద్ కి ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీలు రావడం మాత్రమే కాదు.. ఇక్కడే సత్యం వంటి అతి పెద్ద కంపెనీగా ఎదగడం మనకు తెలిసిందే.
అయితే ఇదే సత్యం కంపెనీని వైయస్ హయాంలో చావు దెబ్బ తీసి ఎదగనీకుండా చేశారు. అదే మీకు కర్ణాటకలో బెంగళూరు బేస్ చేసుకుని.. ఏర్పడ్డ ఇన్ఫోసిస్ ఇంకా పదిలంగా ఉంది. కారణం అక్కడ ఇలాంటి దెబ్బ కొట్టుడు వ్యవహారం లేక పోవడమే. తర్వాత హైదరాబాద్ బెంగళూరుతో సమానంగా సాఫ్ట్ వేర్ హబ్ గా ఎదిగిన విధం ప్రపంచమంతా చూసింది. ప్రస్తుతానికి వస్తే ఇదే ఏపీని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ సాయంతో.. ఒక ఏఐ హబ్ గా తయారు చేసే విధంగా.. ప్రయత్నాలు సాగుతున్నాయ్. దావోస్ కి వెళ్లి అక్కడేమీ సాధించలేక పోయారని కామెంట్ చేశారప్పట్లో ఇదే వైసీపీ నేతలు. తర్వాత దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కారణం దావోస్ లో గేట్స్ ఫౌండేషన్ తో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలే నేడు ప్రతిఫలిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ డ్రోన్ హబ్ గా ఎదుగుతోంది. నెక్స్ట్ స్టెప్ ఏఐ హబ్ గానూ ఎదగడమే టార్గెట్ గా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ వచ్చేసింది. ఇదొక ముందడుగు.
ఇక పోతే పీ- 4 ద్వారా జరిగే విచిత్రాలను వచ్చే రోజుల్లో ఈ ప్రపంచం చూడబోతుంది. ఇదొక ఇంటర్నేషనల్ థియరీ. కావాలంటే మీరు చూడండి సంపన్న దేశాలు, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఈ విధానాలు ఫాలో అవుతుంటారు. మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. అక్కడ ఆహారం విచ్చలవిడిగా పడేస్తామంటే ఒప్పుకోరు. కారణమేంటో తెలుసా? అది ఎందరో కష్టపడి తయారు చేసింది. కాబట్టి ఫుడ్ వేస్టే చేయడం అంటే పండించిన వారిని అగౌరవ పరచడమే అవుతుందని వారిస్తారు. సరిగ్గా అలాగే ఒక వ్యక్తి ఎదుగుదలలో తెలిసీ తెలీకుండా ఒక సమాజం సహాయతా గుణం దాగి ఉంటుంది. వారు అనుకున్న విధంగా ఎదిగాక.. ఆ సమాజానికి తిరిగి ఇవ్వడం అన్నదొక రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తే తద్వారా వారు ఆ రూట్ ఫాలో అయ్యి.. పది మందికి సాయం చేస్తారు. వీరిలో కొందరు ప్రభుత్వ గుర్తింపు కోసమైనా, సమాజంలో గౌరవం కోసమైనా.. కష్టంలో ఉన్న వారికి హెల్ చేయాలన్న భావనకు వస్తారు. దీన్నే బాబు ఇంప్రూవ్ చేశారు. ఆ దిశగా వచ్చే రోజుల్లో మరింత ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రజంట్ సిట్యువేషన్లోకి వస్తాం. ఈ యోగాంధ్ర ఈవెంట్ ఎందుకు? ఎవరి కోసం చేశారు?
లాస్ట్ కి అక్కడేం జరుగుతోంది? దాని ద్వారా లభించిందేంటి? జనం తమకిచ్చిన మేట్స్ లాక్కుని పీక్కుని వెళ్లడం తప్ప.. అన్న దగ్గర ఈ ఫ్యాను బుర్రలు ఆగిపోతున్నాయి.కానీ, బాబు బేసిక్ థియరీ అది కాదు. అసలాయన విచ్చల విడి ఖర్చు ఎప్పుడూ పెట్టరు. అదంతా కూడా ఒక పెట్టుబడే. ఇలా చేయడం వల్ల త్రూ మోడీ ద్వారా అది నేషనల్ న్యూస్ అవుతుంది. అంతే కాకుండా ప్రపంచం మొత్తం జూన్ 21ని ఇంటర్నేషనల్ గా యోగాడేగా ఫాలో అవుతుండటం వల్ల.. అది ఇంటర్నేషనల్ న్యూస్ గానూ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో ప్రపంచ మార్కెట్ని ఏపీ నిర్వహణా సామర్ధ్యంతో విశేషంగా ఆకర్షించవచ్చు. మన ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది.
ఇక్కడ మరో రెండు ముఖ్య మైన విషయాలు సైతం గుర్తించాలి. మొదట మోడీ ఏపీకి ఎంతో చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఉక్కుకు ప్యాకేజీనివ్వడం, రైల్వే జోన్ కి గ్రీన్ సిగ్నల్, ఇంకా పోలవరం నిధులు ఇలా కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. రాజధాని అమరావతి విషయంలోనూ పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. దీనంతటికీ కారణం ప్రధాని మోడీ. ఆయన మనకంటూ ఇంత చేస్తుంటే.. ఆయనకు ఇష్టమైనవి చేయడంలో తప్పు ఏంటన్నది ఒక వాదన.అయితే ఇందులో రెండో యాంగిల్ ఏంటంటే.. మీరు కావాలంటే చూడండి.. మొన్న యూఎస్ లో ట్రంప్ ఆర్డర్ ఒకటి తెచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం అక్కడ ఔషధ ధరలు తగ్గించడం. అయితే, ఇక్కడే రెండు భిన్న మైన వాదనలు వినిపించాయి. అదేంటంటే.. అత్యధిక ధరలు ఔషధాలకు వెచ్చిస్తే మంచి వైద్యం అందుతుంది. ఇది బేసిగ్గా అమెరికన్లు నమ్మే థియరీ. అయితే ఇక్కడ మరో గొప్ప వాదన ఏంటంటే.. అసలు మందులతో అవసరం లేకుండా యోగా, వ్యాయామం తదితరాలు ప్రజలు విరివిగా అలవాటు చేసుకుంటే.. ఔషదాలను వాడకుండా చేయొచ్చన్నది ఒక ఆలోచన వెలుగు చూసింది. దీన్నిబట్టీ చూస్తే జనారోగ్యం కాపాడ్డంలో భాగంగా ఇదొక బెస్ట్ మెథడ్. ఇవేవీ గుర్తించకుండా రాజకీయ ఆరోపణలు కరెక్టేనా? అన్నదొక ప్రశ్న.
మొన్న దావోస్ వెళ్లినపుడు మిస్ అయ్యింది ఈ ఎగ్జిబిటరీ థియరీనే. హైదరాబాద్ బీభత్సమైన స్టాల్ పెట్టి ఎగ్జిబిట్ చేసింది. మన దగ్గర అందుకు స్కోప్ లేకుండా పోయింది. ఇలాంటి స్కోప్ లేనపుడు కల్పించాలన్నది బాబు ఆలోచన. దీంతో వచ్చే యోగాడేని దృష్టిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రాం ప్లాన్ చేద్దామనుకున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగానే చేశారు. మొత్తం మీద ప్రాగ్రామ్ ని భారీ ఎత్తున సక్సెస్ చేశారు.ఈ డబ్బు ఒక పథకానికి ఇవ్వొచ్చు. కాదనడం లేదు. అలాగని ఏ పథకాలకూ డబ్బు ఆపడం లేదుగా.. మొన్నంటే మొన్న భారీ ఎత్తున అమ్మకు వందనం డబ్బులు పడి.. ఇంటిల్ల పాది ఎంత మంది పిల్లలున్నారో.. వాళ్లందరికీ డబ్బులు పడ్డ పరిస్థితులున్నాయి. ఒకే ఇంట్లో లక్షా యాభై ఆరు వేల రూపాయల మేర అమ్మకు వందనం డబ్బులు పడిన వార్తలు సైతం వెలుగు చూశాయి. ఇపుడీ యోగాంధ్ర వంటివి బ్రాండ్ ఏపీని మరింతగా ప్రమోట్ చేస్తాయి.. తద్వారా మన ఉనికిని, నిర్వహణా సామర్ధ్యాన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. అదే వచ్చే రోజుల్లో ప్రాజెక్టులు మన వైపు వచ్చేలా చేస్తాయి. ఇందులో దాగిన మార్కెట్ మంత్ర ఇదీ. ఈ విషయం తెలీక కొందరు.. దీన్ని కూడా ఒక బ్యాడ్ ప్రాపగాండగా మార్చడం ఆంధ్రులు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నారు కొందరు విశ్లేషకులు.