వైసీపీ నాయకులూ.. బీ కేర్‌ఫుల్!
posted on Jul 22, 2024 3:51PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వున్న వైసీపీ నాయకులు... అంటే, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఓ మోస్తరు నాయకులు కావచ్చు, గతంలో జెండా మోసిన, ఇప్పుడు మోస్తున్న కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సానుభూతిపరులు కావచ్చు... అందరూ జరభద్రం... బీ కేర్‌ఫుల్. ఎందుకంటే, మీ మీద దాడులు జరగొచ్చు.. పాపము శమించుగాక... ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే బీ కేర్‌ఫుల్. మీ వెంట వుండేవారే, మీ స్నేహితులే మీ మీద దాడి చేయొచ్చు.. అందుకే బీ కేర్‌ఫుల్. మీమీద దాడి చేసేది తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు కాదు... మీ పార్టీవాళ్ళే దాడి చేస్తారు.. దాడి సందర్భంగా ఏ స్థాయికైనా వెళ్తారు. అందుకే బీ కేర్‌ఫుల్. మీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి ఇప్పుడు బోలెడన్ని శవాలు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నట్టు, మర్డర్లు జరుగుతున్నట్టు క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అయిపోతున్నట్టు కలరింగ్ కావాలి. జగన్ ఎలాంటివాడో మీకు తెలుసు. అధికారం కోసం ఎంతవరకు వెళ్తాడో మీకు తెలుసు. బాబాయికే వీసా ఇప్పించిన ఘనత జగన్‌ది. అందుకే మీకు మరోసారి గట్టి హెచ్చరిక.. జరభద్రం.. బీ కేర్‌ఫుల్!