డప్పు కొట్టనందుకు పింఛన్ కట్.. వైసీపీ నేత ఓవరాక్షన్

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దు లేకుండా పోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లపై కక్షకు దిగుతున్నారనే విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాలంటీర్లపై ఒత్తిడి తెస్తూ టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులకు పింఛన్ కట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటన మరీ దారుణంగా ఉంది. వైసీపీ నేత పర్యటనలో డప్పు కొట్టలేదని కారణంలో కొందరు దళితులకు పెన్షన్ నిలిపివేయడం తీవ్ర దుమారం రేపుతోంది. 

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో గ్రామ వైసీపీ నేత పర్యటనకు దళితులు డప్పు కొట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దళితులకు పింఛన్ కట్ చేశారు. విడపనకల్లు మండలం, డోనేకల్లులో ఇటీవల పర్యటించిన ఓ వైసీపీ నేత పర్యటనలో డప్పు వాయించని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎర్రిస్వామి, అతని సోదరుడు సుంకప్పల పింఛన్ నిలిపివేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు పింఛన్ నిలిపేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు వినడం లేదనే, తమకు మద్దతుగా ఉండటం లేదనే కారణంతో పింఛన్లు కట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఏడాదిలో లక్ష కిలోలకుపైగా గంజాయి పట్టివేత.. పార్లమెంట్ సాక్షిగా ఏపీ పరువు గోవిందా..