సంతకం చేయలేను.. అనుమతించండి.. ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్
posted on Dec 31, 2025 9:13AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై షరతులతో కూడిన బెయిలుపై ఉన్న మిథున్ రెడ్డి.. కోర్టు విధించిన షరతుల నుంచి మినహాయింపు కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు మిథున్ రెడ్డికి బెయిలు ఇస్తూ విధించిన షరతులలో ఒకటి ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలన్నది ఒకటి. ఇప్పుడు ఆ షరతు నుంచి మినహాయింపు కోరుతూ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
కోర్టు విధించిన షరతు మేరకు ఆయన జనవరి 2( శుక్రవారం) సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు తాను సిట్ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయలేననీ, అందుకు అనుమతించాలని మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కార్యాలయంలో మంగళవారం (డిసెంబర్ 30) పిటిషన్ దాఖలు చేశారు. కాగా కోర్టు మిథున్ రెడ్డి పిటిషన్ ను బుధవారం (డిసెంబర్ 31) విచారించనుంది.