టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..
posted on May 26, 2016 4:24PM

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న నేపథ్యంలో.. కొద్ది రోజుల నుండి సైలెంట్ అయినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుండి వైసీపీ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అశోక్ రెడ్డి వైకాపాకు గుడ్ బై చెబుతారని దాదాపు నెలన్నర క్రితమే గుసగుసలు వినిపించాయి. అప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మార్పుపై ఈరోజు రాచర్ల మండలానికి చెందిన కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోదామా? అని ఆయన కార్యకర్తలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.