జూలై 5న జపాన్ ను ముంచెత్తనున్న సునామీ? .. న్యూ బాబా వంగా జోస్యం నిజ‌మ‌వుతుందా?

జ‌పాన్ మాంగా క‌ళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జ‌పాన్ కి భారీ సునామీ రానుంద‌ని చెప్ప‌డంతో.. ఎంద‌రో త‌మ జ‌పాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్క‌సారిగా  జ‌పాన్ టూరిజం ప‌డ‌కేసింది. జూన్ చివ‌రి వారం నుంచి జూలై ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కూ త‌మ త‌మ ప‌ర్య‌ట‌న‌లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. 

కార‌ణం.. న్యూ బాబా వంగాగా  పేరున్న టాట్సుకీ.. 2011 జ‌పాన్ సునామీని కూడా స‌రిగ్గా ఇలాగే అంచ‌నా వేశారు. దీంతో జ‌పాన్ ప్ర‌జ‌లు గుండెలు అర‌చేత ప‌ట్టుకుని తిరుగుతున్నారు. టాట్సుకి తన పుస్తకం "ది ఫ్యూచర్ ఐ సా"లో 2025 జూలై 5న జపాన్ లో భారీ సునామీ వస్తుందని అంచనా వేయ‌డంతో జ‌నం బెంబేలెత్తి పోతున్నారు. ఇక్క‌డ మ‌రో వింత ఏంటంటే జ‌పాన్ ప్ర‌జ‌ల‌క‌న్నా జ‌పాన్ రావాల‌నుకుంటున్న వారు ఈ వార్త తెలిసి హ‌డ‌లెత్తిపోతున్నారు. బేసిగ్గా ఇక్క‌డ ఈ సీజ‌న్లోని ప్ర‌కృతి అందాలు చూడ్డానికి పెద్ద ఎత్తున జులై నెల‌లో టూర్ గా వ‌స్తుంటారు జ‌పాన్ చుట్టుప‌క్క‌ల దేశాల వారు. 

ఇంత‌టి ప్ర‌కృతి వినాశ‌నం  జ‌ర‌గబోతుంద‌ని న్యూ బాబా వంగా చెప్ప‌డంతో.. ఆ ప్ర‌కృతి ప్ర‌కోపంలో ప‌డి మ‌నం ఎందుకు ప్రాణాలు కోల్పోవ‌డం అంటూ స‌గానికి స‌గంపైగా టూరిస్టులు జ‌పాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఎన్నో విమానాలు ర‌ద్ద‌య్యాయి. హోట‌ళ్ల బుకింగ్ కూడా భారీగా  ప‌డిపోయింది.
 
దీనంత‌టికీ కార‌ణం ఇలాంటి జోతిష్యులు చెప్పిన‌వి జరుగుతుండటమే. గ‌తంలో బెల్జియంకి చెందిన  బాబా వంగా కూడా స‌రిగ్గా ఇలాగే ముందే విప‌త్తుల‌ను ఊహించి చెప్పేవారు. ఆమె త‌ర్వాత జ‌పాన్ కి చెందిన టాట్సుకీ సైతం ఇలాంటి ముంద‌స్తు జోస్యాలు చెప్ప‌డం మొద‌లెట్టారు. గ‌తంలో ఇలాంటిదొక‌టి నిజం  కావ‌డంతో.. ఇప్పుడంద‌రూ అదే నిజ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. జులై ఐదున జ‌పాన్ లో ఏదో ఒక విప‌త్తు జ‌ర‌గ‌బోతుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు.

అయితే ఇక్క‌డ జ‌పాన్ ప్ర‌భుత్వం ఏం చెబుతోందంటే.. మీరు భ‌య  ప‌డుతున్నారు గానీ మా జ‌ప‌నీయులు భ‌య ప‌డ్డం లేదు.  అస‌లేం జ‌ర‌గ‌ద‌ని తెగేసి చెబుతున్నారు. ఒక వేళ జూలై ఐదున ఏదైన విప‌త్తు జ‌ర‌గుతుంద‌ని మా వాళ్లు న‌మ్మే ప‌నైతే ఈ పాటికే దేశం విడిచి పారిపోయేవాళ్లు క‌దా? ఇక్క‌డెవ‌రూ అలాంటి హ‌డావిడిలో లేరు కావాలంటే చూసుకోండ‌ని అంటున్నారు.

సునామీ అంటే ఏమిటి? స‌ముద్ర గ‌ర్భంలో ఏర్ప‌డే భూకంపం.. తీర ప్రాంతాల్లోకి భారీ అల‌లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే అదే స‌ర్దుకుంటుంది. ఒక వేళ భూకంపం త‌మ‌ను ప్ర‌భావితం చేస్తే.. ఎలా అన్న‌ది వారు ఇప్ప‌టికే ఒక అవ‌గాహ‌న‌లోకి వ‌చ్చేశారు. త‌మ టెక్నాల‌జీ సాయంతో భూకంపాల‌ను త‌ట్టుకోవ‌డం ఎలాగో నేర్చేసుకున్నారు. కాబ‌ట్టి.. డోంట్ ఫియ‌ర్ పాల‌సీ  మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu