లోకేశ్ మంత్రి కావడం అప్రాధాన్య అంశం.. ఎవరైనా కావొచ్చు.. యనమల
posted on Apr 22, 2016 11:41AM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి పదవిపై ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలన్న చర్చలు నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసి అందరికి షాకిచ్చారు. కాకినాడలో నిన్న మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనను విలేకరులు ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే.. నారా లోకేశ్ మంత్రి అవుతారా?, సీఎం అవుతారా? అని. అంతేకాదు ఇంతవరకూ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న మీ పరిస్థితి ఏంటీ అని కూడా అడిగారట. అయితే ఈ ప్రశ్నకు యనమల సమాధానం చెబుతూ.. లోకేశ్ మంత్రి కావడం, ముఖ్యమంత్రి కావడమనేది అప్రస్తుత, అప్రాధాన్య అంశమని.. ‘‘సీఎం పదవికేముంది... లోకేశ్ కావచ్చు. బొడ్డు వెంకటరమణ(స్ధానిక మీడియా ప్రతినిధి) కావచ్చు’’ అని కూడా యనమల అన్నారట. అంతేకాదుఉపయోగపడే ప్రశ్నలు వేయండంటూ ఒకింత అసహనానికి గురయ్యారట. మరి యనమల ఇంత అసహనానికి గురవ్వడానికి చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల వల్ల కాదు కదా..!