భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఈడెన్ గార్డెన్స్ లోనే

 

ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈనెల 19 న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరగాల్సిన వేదిక గురించి మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. అయితే ధర్మశాల నుండి వేరే ప్రాంతానికి మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఐసీసీని కోరింది. దీంతో ఇప్పుడు వేదిక మార్పుపై పలు ప్రాంతాలు పరిశీలించిన ఐసీపీ ఇప్పుడు ధర్మశాలకు బదులు కోల్‌కత్తాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం కోల్‌కత్తాతో పాటు మొహాలీ, బెంగుళూరు వేదికలను కూడా బీసీసీఐ పరిశీలించింది. కానీ ఆఖరికి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లోనే మ్యాచ్ నిర్వహించాని నిర్ణయం తీసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu