మూడు రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
posted on Mar 18, 2015 9:39AM
.jpg)
సిడ్నీ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ తోలి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లలో ఈరోజు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. కొద్ది సేపటి క్రితమే శ్రీలంక జట్టి బ్యాటింగ్ ఆరంభించింది. కానీ మూడు పరుగులకే శ్రీలంక ఓపెనర్లు కుశాల్ (3), దిల్షాన్ (0) అవుటయ్యారు. వారి స్థానంలో ఇప్పుడు సంగక్కర (0) తిరిమన్నె(1) ఆడుతున్నారు. శ్రీలంక జట్టు తరపున మధ్యూస్ (కెప్టెన్), దిల్షాన్, సంగక్కర , తిరిమానె, మహేలా జయవర్దనే, కుషాల్ జనీత్ పెరేరా, తిసార పెరేరా, నువాన్ కులశేఖర, మలింగా, చమీర ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్ (కెప్టెన్),డికాక్ (వికెట్ కీపర్), డుప్లేసిస్, రోసో, హషీం ఆమ్లా, మిల్లర్, దెల స్టెయిన్, డుమిని, అబాట్, ఇమ్రాన్ తాహిర్, మొర్ని మొర్కేలఖ ఉన్నారు.