పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందిట!
posted on Mar 18, 2015 9:58AM
.png)
సాయి ధరమ్ తేజ్, శ్రద్ద దాస్ మరియు సయామిఖేర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘రేయ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పై రూపొందించిన ఒక పాటను ‘రేయ్ విత్ పవనిజం’ అనే పేరుతో నిన్న విడుదల చేసారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయిన ప్రముఖ దర్శకుడు మరియు నటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఎవరో ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతారని చెపుతుంటారు తప్ప తను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో చెప్పరు. ఆయన వంటి మానవతావాది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది,” అని అన్నారు. ‘రేయ్’ సినిమాని వైవియస్ చౌదరి తన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.