ఇక నాలుగు నెలల ముందే రైల్వే రిజర్వేషన్ చేసుకోవచ్చు

 

ఏప్రిల్ 1వ తేదీ నుండి రైల్వే ప్రయాణికులు నాలుగు నెలల ముందుగా తమ రైల్వే టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవచ్చును. ఇది వరకు మూడు నెలలకు పెంచినట్లే పెంచి మళ్ళీ దానిని రెండు నెలలకి కుదించారు. కానీ ఈసారి ఏకంగా నాలుగు నెలల ముందే రిజర్వేషన్ చేసుకొనే సౌకర్యం కల్పించబోతున్నారు. అయితే తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ వంటి కొన్ని ప్రత్యేక రైళ్ళకి మాత్రం ఈ సౌకర్యం వర్తింపజేయడం లేదు. విదేశీ పర్యాటకులకి మాత్రం 12నెలల ముందే రిజర్వేషన్ చేయించుకొనే సౌకర్యం ఉంది. అందులో కూడా ఎటువంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu