నీటిలో ఐ ఫోన్.. మళ్ళీ బతికింది.. 

అందరికి ఐ ఫోన్ ని ఒకాసారైనా వాడాలని అనుకుంటారు. కొందరు వాళ్ళ స్టేటస్ అందరికి తెలియానాలి ఐ ఫోన్ వాడితే మరి కొందరు ఫీచర్స్ బాగుంటాయని వాడుతారు. ఐ ఫోన్ వాడితే ఆన్లైన్ మోసాలు జరగకుంట సేఫ్టీ ఉంటుందని వాడుతారు. దాదాపు ఐ ఫోన్ గురించి తెలిసిన వాళ్ళు అందుకే వాడుతుంటారు. 

అర్ధ సంవత్సరం పాటు నీటిలో పడిన ఐ ఫోన్ ని బయటికి  తీస్తే మళ్ళీ పనిచేసింది. కెనడాలోని చిల్లివాక్ నగరంలో గతేడాది సెప్టెంబర్‌లో ఓ యువతి చేతిలో నుంచి ఐఫోన్ 11 మోడల్ అనుకోకుండా హ్యారిసన్ సరస్సులో పడిపోయింది. చేసేదేం లేక యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఫ్రీడైవర్ జంట ఈ సరస్సు అడుగున ఉన్న చెత్తను క్లీన్ చేస్తుంటారు. ఇటీవల వారు చెత్తను క్లీన్ చేస్తుండగా వారికి రెండు ఫోన్లు దొరికాయి. 

రెండు ఫోన్లలో ఒక ఫోన్ స్విచ్‌ఆన్ అవలేదని, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ మాత్రం వెంటనే స్విచాన్ అయినట్టు జంట తెలిపింది. ఆ ఫోన్ యజమాని వ్యాంకోవర్‌కు చెందిన యువతి అని తెలుసుకుని ఫోన్‌ను ఆమెకు అప్పగించారు. తన ఫోన్ మళ్లీ తన వద్దకు వస్తుందని అనుకోలేదంటూ యువతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఐఫోన్ 11 మోడల్‌కు ఐపీ 68 (ఇంగ్రెస్ ప్రొటెక్షన్) రేటింగ్ ఉంది. అంటే.. ఈ మోడల్ ఫోన్ నీటిలో(రెండు మీటర్ల లోతు) పడినా అరగంట వరకు ఎటువంటి డ్యామేజ్ కాదు. కానీ తాజాగా దొరికిన ఫోన్ ఆరు నెలలు గడిచినా స్విచాన్ అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.