గంగూలీ పొలిటికల్ ఎంట్రీ..!

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహిండెదరు అన్నట్లు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన రాజకీయ ప్రవేశం అనుకోకుండానే జరుగుతుందని తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన జీవితం లో అన్ని అనుకోకుండానే జరిగాయని తన రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలిదని, కానీ ఏదైనా అప్పటికప్పుడు జరిగిపోతుందని దాదా చెప్పాడు. తన జీవితంలో అన్నీ అలానే జరిగాయని, తన జీవితంలో రాజకీయాలు ఉంటే అది కూడా అలానే అనుకోకుండానే జరగుతుందని దాదా చెప్పాడు. ‘చూద్దాం ఎక్కడిదాకా వెళ్తుందో. వచ్చే అవకాశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగినవే. సచిన్‌ కెప్టెన్సీ  తీసుకుని ఉంటే నాకు కెప్టెన్సీ వచ్చే అవకాశాలే లేవు. కానీ అతడు రిజైన్ చేశాడు. దాంతో తనకు బాధ్యతలు దక్కాయి.

బీసీసీఐ అధ్యక్షుడి పదవి కూడా అలానే వచ్చింది. నిమిషాల ముందు వరకు అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదు. అసలు నాకు ఆ విషయమే తెలియదు. నా జీవితం ఎప్పుడూ అలానే ఉంటుంద’ని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే తనకు రాజకీయ అవకాశాలు వచ్చాయని, కానీ తానే పక్కన పెడుతూ వస్తున్నానని దాదా తెలిపాడు. కుటుంబం, జీవన శైలి, ఆరోగ్యం, పని వంటి చాలా అంశాలన్నీ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని, ప్రజల్లో తనపై ఇంత అభిమానం ఉండటం సంతోషకరమని అందేకే వారిని ఎల్లప్పుడూ కలుస్తూనే ఉంటానని గంగూలీ వివరించాడు.