అపార్ట్‌మెంట్ పైనుంచి న‌గ్న‌*గా కిందపడిన యువతి.. ఏం జ‌రిగిందంటే..

అది సంప‌న్నులు ఉండే పోష్ లొకాలిటీ. అందులో ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌. 7వ ఫ్లోర్‌లో కెమిక‌ల్ ఇంజినీర్ నితిన్ గుప్తాకు చెందిన‌ ఫ్లాట్‌. ఏడాది క్రితం కొవిడ్‌తో ఆయ‌న భార్య చ‌నిపోయింది. అప్ప‌టి నుంచీ ఫ్లాట్‌లో ఒంట‌రిగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఓ బెంగాలీ గ‌ర్ల్ అత‌నితో పాటు ఆ ఫ్లాట్‌కు వ‌చ్చి పోతోంది. క‌ట్ చేస్తే.. 7వ ఫ్లోర్ నుంచి ఆ బెంగాలీ భామ న‌గ్న‌*గా కింద‌ప‌డింది. అంతెత్తు నుంచి ప‌డటంతో తీవ్ర గాయాల‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాపాయం త‌ప్పింది. ఇంత‌కీ ఆ బెంగాలీ యువ‌తి ఎవ‌రు?  గ్రేట‌ర్ నోయిడాలోని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు వ‌స్తోంది?  నితిన్ గుప్తాతో ఆమెకు ఏం సంబంధం? న‌గ్న*గా ఎందుకుంది? ఏడ‌వ అంత‌స్తు నుంచి ఎలా ప‌డింది?  ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డిందా? లేక‌.. నితిన్ గుప్తానే తోసేశాడా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అందులో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. 

ఢిల్లీ స‌మీపంలోని గ్రేటర్‌ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌ 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన సంచ‌ల‌నంగా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆ యువతి.. తన ప్రియుడి కోసం గతంలో ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అనంతరం వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. గొడ‌వ‌ల‌తో వారు విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలోనే గ్రేటర్‌ నోయిడాలోని ఓ ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ నితిన్‌ గుప్తాతో ఆమెకు  పరిచయమైంది. 

తాజాగా, నితిన్‌ గుప్తా ఉండే అపార్ట్‌మెంట్ కింద ఆ యువతి నగ్నంగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నితిన్‌ గుప్తాను విచారించారు. 

"కొవిడ్‌ కారణంగా.. నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఈ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి బాత్‌రూమ్‌కి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది." అని నితిన్ గుప్తా పోలీసులకు చెప్పాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu