వైసీపీ నేతలతో దెబ్బలు తిని.. మంత్రిని కలిసిన సుబ్బారావు

ఒంగోలులో సొంత పార్టీ నేతపై వైసీపీ నేతలు దాడికి దిగడం సంచలనంగా మారింది. వైసీపీ నేత సుబ్బారావును మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు సుభానీ కొడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.  అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ట్విస్ట్ జరిగింది. సొంత పార్టీ నేతలతో దెబ్బలు తిన్న వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిశాడు. మంత్రితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. 

ఒంగోలులోని ఓ లాడ్జీలో తలదాచుకున్న సుబ్బారావును పట్టుకుని చితకబాదాడు మంత్రి అనుచరుడు సుభానీ. ఈ ఘటన తర్వాత సోమవారం సాయంత్రం ఒంగోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి అంశాన్ని వివరించారు సుబ్బారావు.. అక్కడి నుంచి నేరుగా మరికొంతమంది వైసీపీ నేతలతో కలిసి విజయవాడ వెళ్లారు.  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తనపై జరిగిన దాడి వివరాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. అనంతరం సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి మంత్రి, సుబ్బారావు గుప్తా పరస్పరం తినిపించుకున్నారు. ఈ వివాదం సమసిపోవాలని ఇరువర్గాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. తానెప్పుడూ బాలినేని, వైసీపీ విధేయుడినేనని.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రమే వ్యాఖ్యలు చేసినట్లు మంత్రిని కలిసిన తర్వాత సుబ్బారావు తెలిపారు. 

ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.  

సుబ్బారావు  చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపాయి. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నేతలు సుబ్బారావుపై దాడికి ప్ర.త్నించారు. ఇది గమనించిన సుబ్బారావు ప్రాణభయంతో అదృశ్యమయ్యారు. సుబ్బారావు కోసం వెతుకుతున్న దుండగులు ఆదివారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న 15 మంది లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్దలేరు.  ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్రవాహనాన్ని తగలబెట్టారు. అంతటితో వదలకుండా ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దాడి చేశారు వైసీపీ నేతలు. దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ సుబ్బారావుకు వార్నింగ్ ఇచ్చాడు మంత్రి బాలినేని అనుచరుడు సుభాన.  గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించారు.  

జగనన్నకు కోట్లలో బర్త్ డే గిఫ్ట్స్.. రిటర్న్ గిఫ్ట్ కోసమేనా..?

మ‌ద్యం ధ‌ర‌ల‌పై మాట త‌ప్పి, మడ‌మ తిప్పింది అందుకేనా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu