ఎయిర్ పోర్టులో బిడ్డను మర్చిపోయి ఫ్లైట్ ఎక్కిన తల్లి

 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, కంగారు ప్రయాణంలో ఒక్కోసారి లగేజ్ మర్చిపోవడం సహజం. కానీ ఓ తల్లి ఏకంగా కన్న బిడ్డనే ఎయిర్ పోర్టులో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కింది. సౌదీ అరేబియాలోని అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెడ్డా నుంచి కౌలలాంపూర్ వెళ్లేందుకు ఎస్వీ838 విమానం సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా వచ్చి విమానం ఎక్కగానే.. ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. ఇంతలో ఓ మహిళ ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించాలంటూ పైలట్లను కోరింది. తన బిడ్డను జెడ్డా ఎయిర్ పోర్టులోని డిపార్చర్ వెయిటింగ్ హాల్ వద్ద మరిచిపోయి వచ్చానని చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక విమాన సిబ్బంది వెంటనే సమాచారన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు అందించారు. అక్కడ అధికారులకు ఇది విని షాక్ అయ్యారు. ఫ్లైట్ వెనక్కి రప్పించేందుకు ఒకే చెప్పడంతో తిరిగి జెడ్డాకు మళ్లించారు. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu