కింగ్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద సృష్టిస్తాడా?

ర‌న్‌మిష‌న్‌, రికార్డుల రాజు, కింగ్ కోహ్లీ మ‌రొక రికార్డుకు అత్యంత చేరువ‌లో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఇటీవ‌ల అంత‌గా ప‌రుగులు చేయ‌క ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను కాస్తంత నిరాశ ప‌ర‌చిన మాట వాస్త‌వ‌మే. గ‌తం గ‌తహా అన్నారు పెద్ద‌లు. ఆ ఆలోచ‌న‌ల్లోంచి బ‌య‌ట‌ప‌డి కొత్త‌గా కింగ్ ఆసియా క‌ప్ లోకి దిగ‌నున్నాడు. ఫామ్ కోల్పోయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌డం స‌చిన్ అంత‌టివాడికీ త‌ప్ప లేదు. అవ‌న్నీ క్రీడారంగంలోనూ మామూలే. ప్ర‌స్తుతం ఆ పాచ్ దాటి కొత్త కోహ్లీ నూత‌నోత్సాహంతో రెచ్చి పోయే స‌మ‌యం వ‌చ్చింద‌ని వీరాభిమానుల మాట‌. ఎవ‌రెన్ని చెప్పినా రికార్డులు సృష్టించ‌డం కోహ్లీ వంటివారికే సాధ్య‌ప‌డుతుంది. విమ‌ర్శ‌కుల‌కు ఆసియాక‌ప్ లో మంచి స్కోర్ త‌ప్ప‌కుండా సెంచరీ సాధించి బ్యాట్‌తో స‌మాధానం చెబుతాడ‌నే ఆశించాలి. 

ఆసియాక‌ప్‌లో తొలిమ్యాచ్‌లోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇంత‌వ‌ర‌కూ 99 టీ 20 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన కోహ్లీకి ఈ తొలి మ్యాచ్ వందో మ్యాచ్ అవుతుంది. అంటే క్రికెట్ అన్నిఫార్మాట్స్‌లోనూ సెంచరీ సాధించిన భార‌త్ సూప‌ర్‌స్టార్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. 2008లో అంత‌ర్జా తీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ కెరీర్ అద్భుతంగా మ‌ల‌చుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల‌ను సంపాదించుకున్నాడు. 

ఇప్పటి వరకు 99 టీ20లు ఆడిన కోహ్లీ 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 94 పరుగులు. 30 అర్ధ సెంచరీలు చేశాడు. 2017-2021 మధ్య కాలంలో కోహ్లీ 50 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో 30 మ్యాచుల్లో జట్టును విజయాల బాటలో నడపగా 16 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండింటిలో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా అతడి విజయాల రేటు 64.58గా ఉంది. 

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించడంతోపాటు తన సెంచరీల సంఖ్యను 71కి పెంచుకోవాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ చివరి సారి నవంబరు 2019లో సెంచరీ బాదాడు. ఆ తర్వాత 27 టీ20లు ఆడినా సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 2,554 పరుగులు చేశాడు. అందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

ఈ ఏడాది కోహ్లీ ఇప్పటి వరకు ఆడింది నాలుగు టీ20 మ్యాచ్‌లే. 81 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఈ ఏడాది విరాట్ అత్యధిక స్కోరు 52 పరుగులు మాత్రమే. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది 16 మ్యాచుల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 476 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్ 79 కాగా, నాలుగు అర్ధ సెంచరీలు మాత్ర మే చేశాడు. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu