మూజ్ పాట‌.. భార‌త్‌,పాక్ సైనికుల ఆనందం!

ఎవ‌ర‌యినా పాట విన‌గానే కాస్తంత మ‌న‌సూ పారేసుకుంటారు. సినిమాపాట మ‌రీ న‌చ్చిన పాట ఎక్క‌డి నుంచి విన‌ప‌డుతున్నా ఓ క్ష‌ణం ఆగి ఓ ముక్క అలా విని మ‌రీ క‌దులుతారు. అదీ సంగీతం మ‌హిమ‌. సంగీతానికి దేశ‌,ప్రాంత‌, జాతీ భేదాలు ఉండ‌వు. పాట పాటే, సంగీతం సంగీత‌మే. వినే మ‌న‌సుండాలే గాని తెలుగు, హిందీ, పంజాబీ.. మ‌రే భాష‌ద‌యినా స‌రే విన‌సొంపుగా ఉంటే చాలు. కొన్ని పాట‌లు దేశ విదేశాల్లో వీరాభిమానుల‌ను ఎప్ప‌టికీ ఆక‌ట్టుకుంటాయి. అదుగో అలాంటి ఇటీవ‌లి పాటే బంబిహా బోలే అనే పాట‌. పంజాబీ సింగ‌ర్ సిద్ధు మూస్‌వాలా అద్భుతంగా పాడిన‌ది. దీనికి పాకిస్తాన్ పంజాబీలు ఫిదా అయ్యారు.

అది విన‌కుండా నిద్ర‌పోనంత‌గా ఆ పాట వీరాభిమానుల‌ను సంపాదించుకుంది. అన్న‌ట్టు భార‌త సైని కులు భార‌త్‌,పాక్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర స‌ర‌దాగా పాడుకుంటూంటే, అటు వేపు పాకిస్తాన్ సైనికులూ స‌ర‌దాగా డాన్స్ వేస్తూ వారి అభిమానాన్నీ చాటారు. అదీ మూజ్ పాట మ‌హ‌త్తు! దీనికి సంబంధించి ఓ ట్విట‌ర్ ను ఐపిఎస్ అధికారి హెచ్‌జి ఎస్‌.ధాలివాల పోస్టు చేశారు. సిద్దు పాట స‌రిహ‌ద్దుకి రెండు వేపులా ఎంతో యిష్టంగా వింటూ డాన్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. అదో అద్భుతం. పాట‌కు, సంగీతానికి దేశ స‌రిహ‌ద్దులు తుడిపేసే శ‌క్తి ఉంద‌న‌డానికి ఇదో తాజా రుజువు! 

శారీర‌కంగా రెండు దేశాల పౌరులుగా విడ‌పోయిన‌ప్ప‌టికీ పంజాబీలుగా సంగీత‌ప్రియులుగా అంతా ఒక్క‌టే అని ఒక నెటిజ‌న్ టాగ్‌పెట్ట‌డం మ‌రింత ఆక‌ట్టుకుంది. నిజ‌మే. ఒక్క పాట‌, ఒక్క గాయ‌కుడు ఎంత దారు ణాన్న‌యినా, విబేదాల‌న‌యినా మ‌ర్చిపోయేలా చేస్తారు. ఈ పంజాబీ పాట 2020లో విడుద‌ల అయింది. మూజ్‌తో పాటు అమృత్ మాన్ కూడా గొంతు క‌లిపారు. 207 మిలియ‌న్ మంది చూసి త‌రించార‌ట‌!  కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అంత అద్బుత సింగర్ మూజ్ మే 29న మాన‌సా జిల్లా జ‌వ‌హార్కె గ్రామంలో హ‌త్య‌కు గుర‌య్యాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu