ఈ పండు తింటున్నారా!

 

రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే సాదారణంగా మనం మనకి అందుబాటులో వున్నా పండ్లనే  ఎంచుకుంటాం, కాని కొన్ని పండ్లలో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్ని పోషకాలు వుంటాయి, వాటిని తప్పక తిని తీరాలి అంటున్నారు వైద్యులు. అలాంటి పండ్లలో 'కివి' ఒకటి....

 

'కివి' తో మనం పొందే ఐదు లాభాలు :-


* మొట్టమొదటి లాభం కొలెస్ట్రాల్ ని నియంత్రణలో వుంచడం. దాని వల్ల గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా ఉంటాం.

* అలాగే 'కివి' పండులో బత్తాయి,కమలా వంటి పండ్ల లో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు.

* ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుంది.

* ఇక విటమిన్ 'ఎ', ' ఇ' లు కూడా కలిగి ఉండే ఈ పండుతో మరో ముఖ్యమైన లాభం ఆహారంలోని ఐరన్ ని శరీరం త్వరగా మెరుగ్గా గ్రహించే శక్తిని ఇచ్చే గుణం కలిగి వుండటం.

* ఇక చెప్పుకో దగ్గ మరో లాభం 'కివి' పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్  ప్రభావాన్ని అదుపు చేస్తాయి. అలాగే ఎముకల బలహీనత, కీళ్ళ బలహీనత, క్యాన్సర్, ఆస్మా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి.

ఇన్ని లాభాలు వున్నాయని తెలిసాకా 'కివి' పండుని తినకుండా వుంటామా. రోజూ ఓ 'కివి' ఆరోగ్యానికి మంచిది అంటా హాయిగా తినేద్దాం.