హౌడీ మోదీ కార్యక్రమానికి మోదీ హ్యూస్టన్ ని ఎంచుకోవటానికి కారణం అదేనా..?

 

హౌడీ మోదీ కార్యక్రమంలో ట్రంప్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆప్ కి భార్ ట్రంప్ సర్కార్ అంటూ నినదించారు. హౌడీ మోదీ కార్యక్రమం సందర్భంగా ప్రవాస భారతీయులకు విభిన్న రీతిలో ట్రంపును పరిచయం చేశారు. ఆయన ప్రతి రంగంలోనూ చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం అయ్యారు. అమెరికాకే కాకుండా ప్రపంచానికి ఆయన ఎంతో చేశారన్నారు, ఆయనే ట్రంప్ అని మరోసారి అమెరికాను గ్రేట్ చేయాలని తపిస్తున్నారని మోదీ అన్నారు.

హౌడీ మోదీ కార్యక్రమానికి టెక్సాస్ లో ఉన్న హ్యూస్టన్ ని ప్రధాని మోదీ ఎంచుకోవటానికి బలమైన కారణం ఉంది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో జమ్ము కశ్మీర్ అంతర్భాగం కానట్టే అమెరికా ఏర్పడినపుడు టెక్సాస్ కూడా అమెరికాలో భాగం కాదు, పధ్ధెనిమిది వందల ముప్పై ఆరు వరకూ అది మెక్సికో లోని భాగం. టెక్సాస్ లో పుట్టిన శామ్యూల్ హూస్టన్ అనే నాయకుడు నేతృత్వంలో పధ్ధెనిమిది వందల ముప్పై ఆరులో అక్కడి ప్రజలు మెక్సికోపై తిరుగుబాటు చేశారు. తమ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ గా ప్రకటించుకున్నారు.

తర్వాత అమెరికాలో టెక్సాస్ విలీనానికి అమెరికా కాంగ్రెస్, టెక్సాస్ కాంగ్రెస్ మద్దతు తెలుపడంతో యూఎస్ లో టెక్సాస్ ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అటూ ఇటుగా జమ్మూ కశ్మీర్, టెక్సాస్ నేపథ్యాలు ఒకే విధంగా ఉండటంతో 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు హ్యూస్టన్ ను ప్రధాని మోదీ వేదికగా ఎంచుకున్నారు. హౌడీ మోదీ సభావేదికపై ప్రధాని మోదీకి హ్యూస్టన్ కీని బహుకరించారు. ఆ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఈ కీ ను మోదీకి అందజేశారు. హ్యూస్టన్ అభివృద్ధిలో భారత సంతతి పౌరులు కీలక పాత్రలు పోషిస్తున్నందుకు సూచికగా భారీ సైజు హ్యూస్టన్ కీని అందించినట్టుగా టర్నర్ తెలిపారు.