జగనే ఎందుకు ?

ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు?  ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల జ్ణాపకశక్తి చాలా తక్కువ అన్న నమ్మకంతో కావచ్చు  ధైర్యంగా వైనాట్ 175 అంటూ స్వయంగా జగన్ ఒక ప్రశ్నను సంధించి రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజల జ్ణాపకశక్తిపై జగన్ కు ఉన్న నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు కానీ నడుస్తున్న చరిత్ర , పడుతున్న కష్టాలు, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలనను జనం క్షమిస్తారనీ, పట్టించుకోరనీ ఆయన భావించడం అయితే అతి విశ్వాసం లేదా అహంభావం అయి ఉండాలి. లేదా అమాయకత్వం అయ్యి ఉండాలి. కానీ జనగ్ ను అమాయకుడని ఎవరూ భావించజాలరు. వైనాట్ 175 అన్న తన నమ్మకాన్ని నిలుపుకోవడానికి, ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికీ జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి బోలెడు ఉదాహరణలు ఉణ్నాయి
 
నిజానికి ఐదేళ్ల  జగన్  పాలనలో రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే, అరాచకం రాజ్యమేలింది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు . యువత వలసబాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.  

అవి చాలవన్నట్లు, జగన్ రెడ్డి, కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. వేధింపులు, అరాచకాలు తప్ప జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో ఇంకేం లేకుండా పోయింది. దీంతో జగన్  కి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని, ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.  దీంతో వారు  చేసిన తప్పు  మళ్ళీ చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్ ను అధికారం నుంచి దింపాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ ప్రజాభిప్రాయమే సర్వేలలో ప్రతిఫలిస్తోంది.  

జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే  కాదు, చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులెట్టేలా చేయాలన్న జనం నిశ్చయాన్ని కూడా సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.  ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా జనం ఇంకా నెలరోజులా అని భావిస్తున్నట్లుగా వారిలో ఆవేశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వై నాట్ 175 అన్న తన ఆశ పగటి కలేనని జగన్ కే తెలిసిపోయినట్లుంది. దీంతో  గత ఎన్నికలలో తనకు లబ్ధి చేకూర్చిన సెంటిమెంటుపై పడ్డారు. గులకరాయి దాడిని తనపై హత్యయత్నంగా చూపి సానుభూతి పొందడానికి చేసిన యత్నం నవ్వుల పాలు కావడానికి జనం కోడికత్తి దాడి డ్రామాను జనం ఇంకా మరచిపోకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు.   దీంతో మళ్ళీ జగనే ..ఎందుకు కావలి?’ అని వైసీపీ రూపొందించిన ప్రచార కార్యక్రమం  అవును జగనే ఎందుకు ? వద్దే వద్దు అన్న జనవాక్యంగా మారిపోయిందని చెబుతున్నారు.