దేశంలో ట్రెండ్ మారుతోందా? కాషాయ దళంలో కలవరం!

గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే,  జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.  మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్‌సభ స్థానాలలో 61 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.   తగ్గిన పోలింగ్ పై రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. పోలింగ్ శాతం తగ్గింది అంటే,  అది అధికార పక్షానికి పెద్ద మైనస్ పాయింట్ అని అంటున్నారు.  ఉత్తర భారత దేశంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. అనేక హిందీ రాష్ట్రాలు బీజేపీ అంటే ఊగిపోతాయి.  కానీ ఈసారి సీన్ రివర్స్ అవుతోంది. పోలింగ్ శాతం ఢమాల్ అంటూ ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న చోట్లనే ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో బీజేపీకి, మోడీకి టెన్షన్ పట్టుకుంది.  పోలింగ్ శాతం తగ్గడం అంటే కచ్చితంగా ఓటర్లు నిరాశలో ఉన్న‌ట్లే. ఎండలు ఎక్కువ‌గా ఉన్నాయి కాబ‌ట్టి పోలింగ్ త‌గ్గింద‌ని బీజేపీ అంటోంది.  రెండు విడ‌త‌లైయ్యాయి. ఇంకా  అయిదు దశల ఎన్నికలు వున్నాయి. అప్పుడే పూర్తి పిక్చర్ వస్తుంది.

దక్షిణభారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు సీట్లు 139 + కేంద్రపాలిత పాండిచ్చేరిలో 1 సీటు = మొత్తం 140.  ఇందులో బీజేపీ నేరుగా గెలవగలిగే /పొందగలిగే సీట్లు 25 లోపు.
1. కేరళ ..0,

2. ⁠తమిళనాడు …0-01,

3. ⁠కర్ణాటక …. 5-8 లేదా మరీ బాగా వస్తే 10 లోపు,

4. ⁠ఆంధ్రప్రదేశ్ … 5-6
5. ⁠ తెలంగాణ … 5-8,

ఉత్తరభారతదేశంలోనూ ఈశాన్య భారతదేశంలోనూ, ఇతర కేంద్రపాలిత ప్రాంతాలలోనూ అన్ని రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు సీట్ల సంఖ్య 413. నేడు ఉత్తరభారతంలో ఈశాన్యభారతంలో  అన్ని రాష్ట్రాలలో బలమైన అన్ని ప్రధాన వర్గాలూ మోడీకి అమిత్ షాకు బీజేపీకి వ్యతిరేకంగా అట్టుడుకుతున్నాయి. ఇందులో బీజేపీకి వచ్చే సీట్లు 180 నుండి 200 సీట్లు, లేదా మరీ మహా బాగా వస్తే 225 సీట్లు.  ఈలెక్కన మొత్తమ్మీద బీజేపీకి వచ్చే సీట్లు 200 నుండి 225, లేదా మహా బాగా వస్తే అతికష్టం మీద 250.  ఈ పరిస్థితుల్లో, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్ డి ఏ పార్టీల సహాయము మద్దత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదు. 

రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడ‌టం, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వచ్చింది.  ఈ కారణంగానే ఓటర్లు ఓటు వేసేందుకు బయటకు రాలేదనే టాక్ న‌డుస్తోంది.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌