బండి సంజయ్‌కు 'వైట్ ఛాలెంజ్'.. రేవంత్ రెడ్డి ఖతర్నాక్ స్కెచ్
posted on Sep 20, 2021 1:24PM
తెలంగాణ రాజకీయం కాక రేపుతోంది. వైట్ ఛాలెంజ్‌తో అగ్గి రాజుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్టార్ట్ చేసిన వైట్ ఛాలెంజ్‌తో మొదట మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సైతం ఛాలెంజ్ విసిరారు. రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను కేటీఆర్ స్వీకరించలేదు. కొండా మాత్రం వైట్ ఛాలెంజ్‌కు సై అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. మరో ఇద్దరికి సైతం వైట్ ఛాలెంజ్ విసిరారు. ఇదే ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
వైట్ ఛాలెంజ్‌తో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు రేవంత్‌రెడ్డి. ఆ ఛాలెంజ్‌కు.. ఫస్ట్ టార్గెట్ కేటీఆర్ కాగా.. సెకెండ్ టార్గెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అయ్యారు. రేవంత్‌రెడ్డి నుంచి వైట్ ఛాలెంజ్ తీసుకున్న కొండా విశ్వేశ్వరరెడ్డి తాను సైతం మరో ఇద్దరికి వైట్ ఛాలెంజ్ విసిరారు. అందులో ఒకరు బండి సంజయ్ కాగా.. ఇంకొకరు బీఎస్పీ తెలంగాణ బాధ్యులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. వీరిద్దరికీ కొండా వైట్ ఛాలెంజ్ విసరడం రాజకీయంగా అత్యంత ఆసక్తికరం.
రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరితే.. కేటీఆర్ స్వీకరించలేదు. దీంతో కేటీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక,, కొండా విశ్వేశ్వరరెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరితే.. బీజేపీ అధినేత బండి సంజయ్ స్పీకరిస్తారా? అంటే అనుమానమే. ఆయన స్వీకరించకపోతే బండి సంజయ్‌ను సైతం ఇరకాటంలో పడేసే ఎత్తుగడలా కనిపిస్తోంది. ఇక ఒక్క వైట్ ఛాలెంజ్‌తో.. వెంటవెంటనే ఇటు కేటీఆర్, అటు బండి సంజయ్‌లను టార్గెట్ చేసి.. రాజకీయంగా పూర్తి ప్రయోజనం పిండుకునే ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా చేసినట్టే కనిపిస్తోంది. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ బాగా వర్కవుట్ అయినట్టే ఉంది.
ఇక, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వైట్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా? స్వీకరిస్తే.. ఆయన ఏ ఇద్దరికి మళ్లీ వైట్ ఛాలెంజ్ విసురుతారోననేది మరింత ఆసక్తికరం కానుంది. ఒకవేళ స్వీకరించకపోతే.. వైట్ ఛాలెంజ్ ఇక్కడితోనే ముగుస్తుంది. ముగిస్తే.. వైట్ ఛాలెంజ్‌తో ఇరకాటంలో, ఇబ్బందిలో పడ్డది ఇద్దరే ఇద్దరు.. ఒకరు కేటీఆర్. ఇంకొకరు బండి సంజయ్. వారెవా.. వైట్ ఛాలెంజ్. రేవంత్‌రెడ్డి స్ట్రాటజీ అదుర్స్ అంటున్నారు.