టీఎంసీ కార్యకర్తపై చేయి చేసుకున్న రూపా గంగూలీ.. కేసు నమోదు
posted on Apr 25, 2016 3:26PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బీజేపీ మహిళా నేత రూపా గంగూలీ.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై చేయిచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. రూపా గంగూలీ హౌరా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు ఎన్నికలు ప్రారంభమైన సందర్బంగా ఓటింగ్ సరళిని పరిశీలించేదుకు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు... తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన రూపా గంగూలీ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. అంతేకాదు.. సదరు వ్యక్తిని తోసేశారు. దీంతో అక్కడ కలకలం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగి పోలింగ్ బూత్ వద్ద ఘర్ణణకు కారణమై, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రూపాపై కేసు నమోదు చేశారు. కాగా ఉత్తర 24 పరగణాలు, బిధాన్‌నగర్, హౌరా జిల్లాల్లోని 49 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.