రేపు సాయంత్రంతో ప్రచారం ఆపాలి.. ఇక ఇళ్లలోనే ఉండాలి.. భన్వర్ లాల్
posted on Nov 18, 2015 5:09PM
.jpg)
రేపు సాయంత్రం ఐదు గంటల కల్లా వరంగల్ ఉపఎన్నిక ప్రచారం ముగించాలని ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికల పోలింగ్ ఉంటుందని.. అన్నిపోలింగ్ కేంద్రాల్లో సాయుధ కానిస్టేబుళ్ల బలగాలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకూ 9 ఫిర్యాదులు అందాయని.. వివరణ కోరుతూ సీఎస్ కు నోటీసులు పంపించామని తెలిపారు. అంతేకాదు స్థానికేతర నేతలంతా రేపు సాయంత్రం 5 గంటల కల్లా జిల్లా విడిచి వెళ్లాలని.. వారు ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశించారు. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపినా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా ఫిర్యాదు చేయాలంటూ తెలిపారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశామని చెప్పారు.