సరిహద్దుల్లో యుద్ద ఘోష.. భారత ఫస్ట్ టార్గెట్ లాహోర్ ?

పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకార దాడి జరుగుతుందనే అంచనాల నడుమ భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నలుదిక్కుల నుంచీ ముప్పు కమ్ముకొస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం, జరగబోయే అనర్ధాన్ని ఊహించుకుని, తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రతీకార స్వరూప స్వభావాలు, లక్ష్యాలు, ప్రతీకార సమయం, నిర్ణయించుకునే సంపూర్ణ కార్యాచరణ స్వేచ్ఛను భారత సైన్యానికి ఇచ్చిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఏ క్షణంలో అయినా  భారత సైన్యం విరుచుపడే ప్రమాదం పొంచి ఉందనే భయంతో వణికి పోతోంది. 

అయితే.. అదే సమయంలో పాక్  సైన్యం సరిహద్దుల వెంబడి,యధేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. నిజానికి  2021లో ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, పాక్ సైన్యం తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతునే వుంది. కాగా, పహల్గాం ఉగ్రవాద దాడి  (ఏప్రిల్ 22) తర్వాత పాక్ సేనలు భయంతో కాల్పుల జోరు పెంచారు. కాగా.. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘనలు రోజుల తరబడి కొనసాగడమే కాకుండా మొత్తం 720 కిలో మీటర్ల పొడవున వరసగా కాల్పులకు పాల్పడుతున్నారు. మరో వంక భారత  సైన్యం దీటుగా సమాధానం చెపుతోంది.
మరో వంక  సరిహద్దుల్లో ఉభయ దేశాల సేనల మోహరింపు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నిటినీ మించి  పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒకటి రెండు రోజుల్లోనే యుద్ధం రావచ్చని ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. అలాగే.. మనసులో భయాన్ని బయట పెట్టుకున్నారు. యుద్ధం దీర్ఘ కాలం పాటు కొనసాగి, అనివార్య పరిస్థితులు ఎదురైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని అన్నారు. పరిస్థితి అంతవరకు వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే  పాకిస్థాన్  రక్షణ శాఖ మంత్రిని యుద్ద భయం ఆవరించింది అనేది మాత్రం ప్రపంచానికి తెలిసొచ్చిందని అంటున్నారు. 

అయితే పాక్  భయం వట్టి భయం కాదు.. వ్యూహాత్మకంగా నటిస్తున్న భయం అసలే కాదు.  నిజంగా కూడా పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందనే   అంటున్నారు. ముఖ్యంగా  భారత దేశం ప్రతీకార చర్యలలో భాగంగా ఒకదాని వెంట ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు పాక్  కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోరుచుట్టుపై రోకటి పోటులా సలుపుతున్నాయని అంటున్నారు.
 ఓ వంక పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి  వేటాడే పని  ఇంచు మించుగా   ముగింపు  దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఉగ్రవాదుల వేటలో ఉన్న సైనిక దళాలు, ఉగ్రవాదుల ఆచూకీ గుర్తించాయి. అంతే  కాదు 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులను మట్టు పెట్టడం ఖాయమని, ఏ క్షణంలో అయినా శుభవార్త  రావచ్చని గ్రౌండ్ జీరో సమాచారంగా చెపుతున్నారు. 

అన్నిటినీ మించి పాక్ గుండెల్లో రైళ్ళు కాదు, ఏకంగా యుద్ద విమానాలే పరుగులు తీస్తున్నాయని అంటున్నారు. అవును  పాక్  రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లో, ఆయన ముఖ కవళికల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే..  ఆయన పదే పదే గత్యంతరం లేని పరిస్థితి వస్తే, అణ్వాయుదాలు ప్రయోగిస్తామని అంటున్నారు. మరో వంక చడీ చప్పుడు కాకుండా భారత సేనలు వ్యూహాత్మకంగా లాహోర్ పై దాడికి సిద్దమవుతునట్లు తెలుస్తోంది. నిజానికి పాక్ భయానికి ఖవాజా ఆసిఫ్  ప్రేలాపనలకు ఆదే కారణంగా  కనిపిస్తోందని అంటున్నారు.  అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సంపూర్ణ కార్యాచరణ స్వేచ్చతో భారత సేనలు ఎప్పుడు ఏమి చేస్తాయి అనేది పక్కన  పెడితే. ధర్మం మన వైపుఉంది... అంతిమ విజయం మనదే అవుతుంది. ధర్మో రక్షిత రక్షితః!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu