హస్తినకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (మే 2) హస్తినకు బయలుదేరారు. ఢిల్లీలో సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసి) సమావేశంలో ఆయన పాల్గొంటారు.  

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ నాయకులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu