డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో దొరికిపోయిన మూవీ డైరెక్టర్
posted on Sep 20, 2014 9:18AM

హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో ‘వాంటెడ్’ దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. దాంతో రామ్ గోపాల్ వర్మ ఓ ఆటో ఎక్కి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా బీవీఎస్ రవితోపాటు మరో 20 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరందరికీ సోమవారం నాడు కౌన్సిలింగ్ నిర్వహించి, మంగళవారం కోర్టులో హాజరు పరుస్తారు. దర్శకుడు బి.వి.ఎస్.రవి గతంలో ఒకసారి మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు.అయినా మనిషి మారలేదు.