ఓటుకు నోటు కేసు... సుప్రీం సూపర్ ట్విస్ట్...
posted on Nov 6, 2017 5:13PM

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా సూపర్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓటు నోటు కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు నడిచిన ఈ కేసులో ఇప్పటివరకూ పురోగతి ఏం లేదు. ఈ నేపథ్యంలో దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో జాప్యం చోటుచేసుకుందని.. తెలంగాణ ఏసీబీ ఈ కేసులో దర్యాప్తును నిష్పక్షపాతంగా సాగించడం లేదని..సీబీఐకి అప్పగించాలని కోరారు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతోపాటు ఓటుకు నోటు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని సూచించింది. విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది. ఇక తాజాగా సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల రాజకీయాలు మారుతాయా...? అని అప్పుడే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.