వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్

 

వైఎస్ వివేక హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించినా ఫలితం లేకపోయింది. ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. దీంతోనూ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ కోర్టు కూడా గంగిరెడ్డి బెయిల్ రద్దూ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గంగిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పలుమార్లు విచారణ జరిగింది. అయితే ఆయా సమయాల్లో విచారణను ధర్మాసనం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ఇరువర్గాల వాదన విన్న కోర్టు.. గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుప్రీంకోర్టులో ఆయనకి ఊరట లభించింది. 

కాగా 2019 ఎన్నికలకు ముందు వివేకానందారెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గంగిరెడ్డిని ఏ1 నిందితుడిగా పోలీసులు గుర్తించారు. గంగిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే పులివెందుల కోర్టు ఇచ్చిన తీర్పుతో గంగిరెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. సీబీఐ అధికారులు కడపతో పాటు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టులు ఆయనకి బెయిల్ రద్దు చేశాయి. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu