వివేకా హత్య కేసులో నిందితునికి బెదిరింపు
posted on Jul 12, 2025 5:41PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 3 ముద్దాయి ఉమా శంకర్ రెడ్డి కి బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ మేరకు ఆయన పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు. తాడిపత్రి కి చెందిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి పేరు చెప్పి ఈనెల 11వ తేదీ ఫోన్ ద్వారా తనను రెండు రోజుల్లో చంపుతామని బెదిరించాడని ఉమా శంకర్ రెడ్డి ఏ.ఎస్. ఐ సిద్దు కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారి నుండి నన్ను రక్షించాలని ఫిర్యాదులో కోరారు. 2019 మార్చి15న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత చిన్నాన్నా వైఎస్ వివేకానందరెడ్డి.. పులివెందుల్లోని తన నివాసంలో దారుణంగా హత్యకావించ బడ్డారు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజులు ముందు కావడంతో ఈ హత్యకు రాష్ట్ర రాజకీయాల్లో రగడ లేపింది.