ఎన్‌కౌంటర్ శంకర్ గా ప్రిన్స్

 

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన "దూకుడు" చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం "ఆగడు". ఈ చిత్రంలో మహేష్ ఎన్‌కౌంటర్ శంకర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా మొదటిసారిగా జోడి కట్టనుంది. ఈ చిత్రంలో మహేష్ సీమ యాసలో మాట్లాడనున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu