జగన్ నిరూపిస్తే..మంత్రి పదవికి రాజీనామా చేస్తా : లోకేశ్
posted on Jun 2, 2025 7:06PM
.webp)
విశాఖలో ఉర్సా కంపెనీకి రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామని లోకేశ్ స్పష్టం చేశారు. జగన్ ఆరోపణలు తప్పని తేలితే యవతకు క్షమాపణలు చెప్పాలని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి ? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు., యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. . ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి కి కొత్తేమీ కాదని తెలిపారు.