ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకే తలమానికమైన ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి ఎప్పటిలాగే భక్తులను దీవించడానికి సిద్ధమయ్యాడు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకోవటానికి బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా గణపయ్యను దర్శించుకుని తొలి పూజలో పాల్గొన్నారు. కాసేపట్లో మహా గణపతి వద్దకు 500 కిలోల లడ్డూ ప్రసాదం చేరుకోనుంది. పద్మశాలి సంఘం ప్రతినిధులు 75 అడుగుల నూలు కండువా, జంజం, పట్టు వస్త్రాలను సమర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu