సీడీ కేసులో..నా భర్తను ఇరికించారు
posted on Sep 4, 2016 8:19PM

నా భర్తను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారంటూ ఆరోపణలు చేశారు ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ భార్య రీతూ కుమార్. ఆత్యాచార కేసుపై ఆమె స్పందించారు, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నానని అన్నారు. కుట్ర పన్ని ఆయన్ను ఎవరో ఇందులో ఇరికించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన భర్తపై తనకు పూర్తి నమ్మకముందని..ఆయనకు పూర్తి అండగా ఉంటానని రీతూ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం సందీప్ ఇద్దరు మహిళలతో ఉన్న సీడీ బయటకు రావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనే పోలీసులకు లొంగిపోయారు.