కావేరిపై సుప్రీంలో కర్ణాటకకు షాక్..

తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న కావేరి జలాల వివాదంపై ఇవాళ సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. కావేరి జలాల్లో 15 వేల క్యూసెక్కుల నీటిని పది రోజుల పాట విడతలవారీగా అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వలేమన్న కర్ణాటక వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu