గేట్ వే హోటల్ లో ఉండవల్లికి వాటా?
posted on Dec 28, 2011 1:11PM
విజయవాడలోని ప్రముఖ హోటళ్ళలో గేట్ వే హోటల్ ఒకటి. బందరు రోడ్డును ఆనుకుని ఉన్న ఈ హోటల్ ఇటీవల చేతులు మారింది. దీనిని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు కలిసి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వంగవీటి మోహనరంగా అనుచరుడిగా ఉంటూ లిక్కర్ వ్యాపారం చేస్తూ, వై.ఎస్ చలువతో ఉడా చైర్మన్ గా చేసి అప్పనంగా అర్జించిన మల్లాది విష్ణుకు హోటల్ కొనుగోలు చేసే శక్తి ఉంది. ఎటొచ్చీ రాజకీయాల్లో ఉంటూ కూడా డబ్బు ఆర్జించలేకపోయాడన్న పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ హోటల్ లో భాగస్వామ్యం పొందారన్న సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. వై.ఎస్.కు వీరవిధేయుడుగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి వై.ఎస్ మరణానంతరం జగన్ ను బహిరంగంగానే వ్యతిరేకించి అధిష్టానం మెప్పును ప్రభుత్వ పెద్దలనుంచి లబ్ధిని పొందారన్న ప్రచారం జరిగింది. అనంతరం ఆయన విజయవాడ హోటల్ లో వాటా తీసుకున్నట్లు నగరంలోని వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.