పటోళ్లను చంపింది మేమే

హైదరాబాద్‌ : పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి చంపింది తామేనని గోవర్ధన్‌రెడ్డి అనుచరులు ప్రకటించారు. ఉప్పల్‌లోని చిలకానగర్‌లో ఉన్న భూవివాదం కారణంగానే పటోళ్లను హత్య చేసినట్టు తెలుస్తోంది.  తమకు ఎవరితోనూ సంబంధాలు లేవని వారు చెప్పారు.  పటోళ్ల అనుచరులు అనిల్‌, ప్రశాంత్‌, నరేందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డిలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో తాము పటోళ్లను హత్య చేసినట్టు వారు అంగీకరించినట్టు సమాచారం.

కాగా పటోళ్ల గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నిందితుడు. అతనిపై 65 కేసులున్నాయి. వాటిలో 12 హత్య కేసులు. తొలుత విప్లవోద్యమంలో పనిచేసిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఆ తర్వాత తన సొంత ముఠాను సిద్ధం చేసుకుని, సెటిల్మెంట్లకు దిగాడు. అయితే, తన భర్తను నయీమ్ గ్యాంగ్ హత్య చేసిందని పటోళ్ల గోవర్దన్ రెడ్డి భార్య వింద్యా రెడ్డి ఆరోపిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu