ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయనపై సెటైర్లు వేశారు. "రెయిన్‌ గన్‌ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్‌ చేశాడు. తుపాన్‌లను ఒంటిచేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు" అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

"కుల వృత్తులలో మెజారిటీ బీసీలే. వారి కోసం వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్య పథకాన్ని అటకెక్కించి. గతంలో పచ్చచొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి కుల వృత్తుల వారికి పనిముట్ల పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలెట్టాడు... ప్రలోభాలకు ఆదిగురువైన  చంద్రబాబు" అంటూ ట్విట్టర్లో చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu