జగన్ అరెస్ట్ ఎప్పుడు?
posted on May 1, 2012 10:26AM
అక్రమార్జన కేసు విషయంలో ఎంతో హడావుడి చేసి ఆడిటర్ విజయసాయిరెడ్డి, సునీల్ రెడ్డి తదితరులను అరెస్టు చేసిన సిబీఐ ఈ కేసులో ప్రథమముద్దాయిగా ఉన్న జగన్ ను మాత్రం అరెస్టు చేయటానికి వెనుకాముందు ఆడుతుంది. మొదట విజయసాయిరెడ్డి తరువాత సునీల్ రెడ్డిని అరెస్టు చేసిన సిబీఐ అనుబంధ ఛార్జిషీటు పేరుతొ కొంత కాలాయాపన చేసింది.
అనుబంధ ఛార్జిషీటులో జగన్ ను ప్రథమ ముద్దాయిగా పేర్కొంది. ఒకవైపు విజయ సాయిరెడ్డి, సునీల్ రెడ్డిలకు బెయిల్ రాకుండా అడ్డుపడిన సిబీఐ ప్రథమముద్దాయిగా ఉన్న జగన్ ను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. జగన్ ను అరెస్టు చేస్తే ఆయన సానుభూతిపరులు అడ్డుకుంటారన్న భయం సిబీఐ అధికారులకు ఉంది. అలా అని జగన్ ను స్వేచ్చగా వదిలేస్తే సిబీఐ పై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారానే జగన్ ను అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సిబీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ ప్రక్రియకు ఎంతకాలం పడుతుందో తెలియదు. అప్పటిదాకా జగన్ ప్రజలమధ్య తిరిగే అవకాశముంది.