మాల్యా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ... రూ.6,630 కోట్లు
posted on Sep 3, 2016 2:53PM

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం వేసి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంలో మాత్రం ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) బాగానే దర్యాప్తు వేగం చేస్తుంది. మాల్యా ఆస్తులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేలం వేయడం.. లేదా వాటిని జప్తు చేయడం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మాల్యాకు సంబంధించిన కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మాల్యాకు చెందిన దాదాపు రూ.6,630 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో మాల్యాకు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్ తో పాటు షాపింగ్ మాల్, పలు కంపెనీల్లోని ఆయన షేర్లు ఉన్నాయి. కాగా విచారణకు హాజరుకావాలన్న తన నోటీసులకు ససేమిరా అంటున్న మాల్యాకు ఇప్పటికే కోర్టు ద్వారా ఈడీ సమన్లు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.