తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మిస్తాం

 

తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం కధ మళ్ళీ మొదలయింది. ఇంతకు ముందు ప్రభుత్వాలు దానిని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పినప్పటికీ అనేక అవాంతరాలు ఏర్పడటంతో ఆ పని ఇంతవరకు మొదలవలేదు. మొన్న తిరుమలకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వెయ్యి కాళ్ళ మండపాన్ని పునర్నిర్మిస్తుందని తెలిపారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. ఈ ఏడాది నుండి తమ ప్రభుత్వం కడప జిల్లాలో గల ఒంటిమిట్ట శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu