వేణు స్వామిని కామాఖ్య టెంపుల్‌లో బ‌య‌ట‌కు తోసింది నిజ‌మేనా?

 

ఈ మ‌ధ్య కాలంలో మ‌నం అరుణాచ‌లానికి ఎక్కువ‌గా తెలుగు వారు వెళ్తున్న దృశ్యం చూసే ఉంటాం. ఇందుకు కార‌ణం చాగంటి ప్ర‌వ‌చ‌నాలు. ప్ర‌స్తుతం ఏ యూట్యూబ్‌లో చూసినా, ఏఎఫ్ఎం రేడియో విన్నా.. ఏ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ప‌రిశీలించినా ఎక్కువ‌గా క‌నిపించేది చాగంటి ప్ర‌వ‌చ‌నాలే. 

చాగంటి త‌న ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాల్లో భాగంగా అరుణాచ‌లం గురించి చెప్పిన ఒకానొక విధం తెలుగు వారికి బాగా అనిపించి.. ఈ మ‌ధ్య చిన్నా పెద్ద‌ అనే తేడాల్లేకుండా అంద‌రూ క‌ల‌సి.. భారీ ఎత్తున అరుణాచ‌లం వైపు వెళ్తున్నారు. చాలా చాలా విచిత్ర‌మేంటంటే.. యువ‌త ఎక్కువ‌గా అరుణాచ‌లం వ‌చ్చి ఇక్క‌డి గిరి ప్ర‌ద‌క్షిణం ఎలా చేయాలో తెలుసుకుని మ‌రీ చేస్తున్నారు.

ఇక్క‌డి ర‌మ‌ణ మ‌హ‌ర్షి వంటి ఆశ్ర‌మాల‌తో స‌హా ఎన్నో వింత‌లూ విశేషాల‌ను ద‌ర్శించి త‌మ బిజీ లైఫ్ లోంచి కాస్త ఉప‌శ‌మ‌నం వెతుక్కుంటున్నారు. కానీ వేణుస్వామి లాంటి వారు కొంద‌రుంటారు. ఇలాంటి వారి వ‌ల్ల లాభాల‌క‌న్నా న‌ష్టాలే ఎక్కువ‌ని అంటారు.

రీసెంట్‌గా  ఆయ‌న నిధి అగ‌ర్వాల్ కి కూడా ఏదో తాంత్రిక పూజ చేశారు. ఆమె కెరీర్ మూడు హిట్లు- ఆరు ఆఫ‌ర్లు కావాల‌ని. ఎప్పుడైతే ఆమె అలా పూజ చేసుకుందో లేదో వెంట‌నే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు పోయింది. స‌రే, పోతే పోయింద‌ని భావించే లోపు.. అధికారిక వాహ‌నం వివాదం ఒక‌టి రాజుకుంది. చివ‌రికి దానిపై తానే స్వ‌యంగా క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్ గా రాజాసాహెబ్ ఉందిలే అన్న ఆశ‌తో ప్ర‌స్తుతం నిమ్మ‌ళంగా ఉంది.

ఇక వేణుస్వామి కార‌ణంగా పోయిన ప్రాణాలు కూడా ఉన్నాయి. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌నే మ‌ళ్లీ గెలుస్తాడ‌ని ఇత‌డు చెప్పిన జోశ్యం నిజ‌మ‌ని న‌మ్మిన కొంద‌రు.. చివ‌రికి బెట్టింగులకు పాల్ప‌డ్డారు. భారీ ఎత్తున డ‌బ్బు పెట్ట‌డంతో అవి కాస్తా పోయాయి. దీంతో కొంద‌రు కోట్ల రూపాయ‌ల న‌ష్టాల పాలై.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప‌రిస్థితి.

ఇక రీసెంట్ గా వేణు స్వామి కామాఖ్య వెళ్తే అక్క‌డి పూజారులు ఇత‌డ్ని గుర్తించి మ‌రీ బ‌య‌ట‌కు గెంటేశారన్న వీడియోలు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై తెగ ట్రోల‌వుతున్నాయి. కార‌ణం వేణు స్వామి కామాఖ్య ఆల‌యం గురించి చెప్పిన విదం అలాంటిదని అంటారు. ఒక వీడియోలో అయితే ఆయ‌న అంబానీ ఫ్యామిలీ వంద మేక‌లు, పావురాళ్ల‌ను బ‌లిచ్చార‌ని చెప్ప‌డంతో.. ఇదొక సంచ‌ల‌నంగా మారింది. 

దీంతో కొంద‌రు కామాఖ్య ఒక తాంత్రిక శ‌క్తిపీటంగా భావించి ఇక్క‌డికి వ‌చ్చి బ‌లులు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.  నిషేధ‌మైన బ‌లుల సంప్ర‌దాయాన్ని వేణుస్వామిలాంటి కొంద‌రు తాంత్రిక స్వాములు తిరిగి రెచ్చ‌గొడుతున్నార‌ని తెలుస్తోంది. కామాఖ్య పూజారులు ఈ విష‌యం గుర్తించి ఇటీవ‌ల ఆ ఆల‌యానికి వెళ్లిన వేణు స్వామిని వారు లోప‌లికి రానివ్వ‌లేద‌ని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu