ఈ విజ‌య‌ ద‌శ‌మికి మందు ముక్కా లేవుగా ఎందుకంటే!?

 

మొన్న ఆగ‌స్ట్ 15, 16, 17 మూడు రోజుల సెల‌వులు మూకుమ్మ‌డిగా రావ‌డంతో ఆ ఆనందం త‌ట్టుకోలేక పోయింది మ‌న బాల స‌మాజం. కార‌ణం ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్ డే, ఆగ‌స్ట్ 16 సెకండ్ శాట‌ర్ డే, ఆపై ఆగ‌స్ట్ 17 సండే. ఈ మూడు సెల‌వుల‌తో ఇటు పేరెంట్స్ కి పిల్ల‌ల ప‌రేషాన్- అటు పిల్ల‌లు చూస్తే దిల్ ఖుష్ అయిపోయారు.

ఈ ఆనందం ఆవిరి చేయ‌డానికా అన్న‌ట్టు ఈ సారి వ‌చ్చే ద‌స‌రా అక్టోబ‌ర్ 2న వ‌చ్చింది. దీంతో రెండు సెల‌వులు కాస్తా ఒక సెల‌వుగా మారింది. మాములుగా అయితే మ‌నకు అధికారికంగా విజ‌య‌ద‌శ‌మి, గాంధీ జ‌యంతి రెండు వేర్వేరు సెల‌వులు. చిత్ర‌మైన విష‌య‌మేంటంటే.. ఈ రెండూ ఒకే రోజు రావ‌డంతో ఒక సెల‌వు కాస్తా ఎగిరిపోయింది.

సెల‌వు సంగ‌తి అలా ఉంచితే కొంద‌రు విజ‌య‌ద‌శ‌మికి క‌క్కా ముక్కా భారీ ఎత్తున ప్లాన్ చేస్తారు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ క‌ల్చ‌ర్‌లో  దావ‌త్‌లు  పెద్ద ఎత్తున న‌డుస్తాయ్. మందు విందు పొంగిపొర్లుతాయి. ఆ రోజు గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో పాపం.. ఈ మందుబాబుల‌కు చ‌చ్చేంత ప‌నొచ్చింది. 

బేసిగ్గా ఈ విజ‌య‌ద‌శ‌మి- గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఆ రోజు ముక్క ముట్ట‌క పోవ‌డ‌మే మంచిద‌ని భావిస్తారు. ఎందుకంటే గ‌తంలో సీపీఐ నారాయ‌ణ స‌రిగ్గా ఇలాగే.. గాంధీ జ‌యంతి రోజున చికెన్ తిని అడ్డంగా బుక్ అయిపోయారు. దీంతో పండ‌గ సంద‌డి కాస్తా ఆవిరైంద‌న్న ఆలోచ‌న ఫీలింగ్ లో  ఇటు చిన్నా పెద్ద ప‌డిపోవ‌డం క‌నిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu