మారుతి రాధ పాత్రలో వెంకీ

 

"కొత్తజంట" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న మారుతి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు. వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్ ను ఖరారు చేశారు. యూనివర్సల్ మీడియా బ్యానర్ లో నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు మారుతి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నయనతారను ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ నటించిన "మసాలా" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.