ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ దుర్మరణం

 

కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పోట్లదుర్తి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ  రోజూ లాగే తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు. 

దీంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మమ్మ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు