కేంద్రమంత్రి పదవికి వెంకయ్య రాజీనామా

ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి వచ్చిన వెంకయ్యనాయుడు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. గత ఆదివారం నుంచి వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థి అంటూ వార్తలు వస్తున్నాయి..అయితే నిన్న ఈ వార్తలు అవాస్తవం అని నమ్మవద్దని ఖండించారు వెంకయ్యనాయుడు. ఇది జరిగిన కాసేపటికే ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసరంగా సమావేశమై వెంకయ్యను ఎన్డీఏ పక్షాల తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన నిన్న రాత్రి పొద్దుపోయాక మంత్రి పదవికి రాజీనామా చేశారు,. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించి..ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu