కాంగ్రెస్ పార్టీపై వెంకయ్య ఫైర్.. అసహనం పేరుతో విమర్శలు చేస్తోంది..
posted on Nov 20, 2015 12:00PM
.jpg)
కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసహనం పేరుతో విమర్శలు చేస్తోందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అసహనానికి గురైందని.. అందుకే అందరిపై అసహనంతో ఇలా విమర్సలు చేస్తున్నారు.. ముందు అసహనానికి గురైంది కాంగ్రెస్ పార్టీనే అని.. అది ఆ పార్టీ గుర్తించాలని విరుచుకుపడ్డారు. అనవసరంగా కుల, మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపుతోందని.. అందుకే తన రాజకీయ అవసరాల కోసం కుల, మత శక్తులను ప్రోత్సహిస్తోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్‌ను పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని కుల, మత, వర్గంగా విడగొట్టింది కాంగ్రెస్సే అని వ్యాఖ్యానించారు.