ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన నితీష్ కుమార్
posted on Nov 20, 2015 1:30PM
.png)
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేసారు. దీనితో ఆయన ఐదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరుగుతోంది. బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. నితీష్ కుమార్ తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్, ఆ తరువాత పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వారిలో తేజ్ ప్రతాప్ యాదవ్ కొన్ని పదాలను సరిగ్గా ఉచ్చరించకపోవడంతో గవర్నర్ రామ్ నాథ్ అతని చేత మళ్ళీ ప్రమాణస్వీకారం చేయించారు.
నితీష్ మంత్రివర్గంలో ఆయనతో కలిపి మొత్తం 28మంది మంత్రులుగా ఉంటారు. వారిలో జెడీయు, ఆర్.జె.డి.ల తరపున చెరో 12 మంది, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు కలిపి మొత్తం 28మంది మంత్రులు ఉంటారు. ఈ కార్యక్రమానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.